Indian Railways : ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు, టిక్కెట్ల బుకింగ్‌లో పారదర్శకత పెంచేందుకు భారతీయ రైల్వేలు (Indian Railways) ఇటీవల అనేక కీలక మార్పులు తీసుకొచ్చాయి. 2025 జూలై 1వ తేదీ నుండి అమలులోకి వచ్చిన ఈ మార్గదర్శకాల ప్రభావం చాలా విస్తృతంగా ఉండనుంది. టికెట్ ధరల పెరుగుదల నుంచి, తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ విధానం, ఏజెంట్లకు కొత్త పరిమితుల వరకూ ఈ మార్పులు వర్తిస్తాయి.
Indian Railways – తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి
ఇప్పటి నుంచి తత్కాల్ టిక్కెట్లను IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. దీనివల్ల టిక్కెట్ల దుర్వినియోగం తగ్గి, న్యాయమైన ప్రయాణికులకు ప్రాధాన్యత లభించనుంది.
ఏజెంట్లకు కొత్త పరిమితులు
జూలై 1వ తేదీ నుంచి, అధికారిక రైల్వే (Indian Railways) ఏజెంట్లు ఉదయం 10:00 నుంచి 10:30 వరకు ఏసీ తరగతికి సంబంధించిన టిక్కెట్లు, 11:00 నుంచి 11:30 వరకు నాన్-ఏసీ టిక్కెట్లు బుక్ చేయలేరు. ఇది సాధారణ ప్రయాణికులకు బుకింగ్‌లో ప్రాధాన్యతనిచ్చేలా రూపొందించబడింది.
OTP ధృవీకరణతో కౌంటర్ బుకింగ్
జూలై 15 నుంచి కౌంటర్ల ద్వారా తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు OTP ఆధారిత ధృవీకరణ విధానం అమలులోకి రానుంది. ఇది ఫ్రాడ్ నివారణలో కీలక పాత్ర పోషించనుంది.
టికెట్ ధరల్లో మార్పులు
కొన్ని ముఖ్యమైన రైళ్లకు ధరలు పెరిగాయి. ఇందులో రాజధాని, శతాబ్ది, వందే భారత్, దురంతో, తేజస్, హమ్‌సఫర్ వంటి ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ముఖ్యంగా 500 కి.మీ దూరం దాటి ప్రయాణించే వారిపై ఈ ఛార్జీలు ప్రభావం చూపనున్నాయి.
పెరిగిన ఛార్జీలు ఇలా ఉన్నాయి:
సెకండ్ క్లాస్: కిలోమీటరుకు 1 పైసా
ఫస్ట్ క్లాస్ (ఏసీ): కిలోమీటరుకు 0.5 పైసా
స్లీపర్ క్లాస్: కిలోమీటరుకు 1 పైసా
ఫస్ట్ క్లాస్ (నాన్-ఏసీ): కిలోమీటరుకు 1 పైసా
అయితే 500 కి.మీ లోపు ప్రయాణాలకు ఛార్జీలు పెరగవు. 501 నుండి 1,500 కి.మీ వరకు రూ.5, 1,501 నుండి 2,500 కి.మీ వరకు రూ.10, 2,501 కి.మీ దాటి రూ.15 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
చార్ట్ తయారీకి ముందస్తు సమయం
ఇంతకుముందు రిజర్వేషన్ చార్ట్ రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు తయారయ్యేది. ఇప్పుడు ఇది 8 గంటల ముందే సిద్ధం చేయాలని నిర్ణయించబడింది. ఇది ప్రయాణికులకు చివరి నిమిషం ఊహాగానాలు లేకుండా ముందస్తు సమాచారం అందించేందుకు దోహదపడుతుంది.
ఇతర నిబంధనలు యథాతథంగా కొనసాగింపు
రిజర్వేషన్ ఫీజులు, సూపర్‌ఫాస్ట్ ఛార్జీలు, ఇతర అదనపు ఫీజుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అలాగే, టికెట్ ధరపై ఇప్పటికే ఉన్న GST విధానం కూడా యథాతథంగా కొనసాగుతుంది.
Also Read : MP Purandeswari-BJP Exclusive :బిజేపీ మహిళా సారథి రేసులో పురంధేశ్వరి..?
















