Indian Railway : ఢిల్లీ – రైల్వే శాఖ కోలుకోలేని షాక్ ఇచ్చింది ప్రయాణీకులకు. ఇవాల్టి నుంచి దేశ వ్యాప్తంగా ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏసీ జర్నీకి కి.మీ.కు 2 పైసలు, నాన్ ఏసీ కి.మీ. ఒక పైసా చొప్పున పెంచింది. ఏసీ తరగతి ఫస్ట్ క్లాస్ , 2 టైర్ , 3 టైర్ , చైర్ కార్ కింద బుక్ చేసుకునే టికెట్ల ధరలు పెంచింది. సబర్జన్ ఛార్జీలు, నెలవారీ సీజనల్ ఛార్జీలను అలాగే ఉంచింది. ఏదైనా ఏసీ తరగతిలో 1,000 కి.మీ ప్రయాణిస్తే రూ.20 ఎక్కువ చెల్లించాలి. ఎక్స్ ప్రెస్ మెయిల్ , ఎక్స్‌ప్రెస్ రైలులో (Indian Railway) స్లీపర్ లేదా జనరల్ కోచ్‌లో ప్రయాణించే వారికి అదనంగా రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది.
Indian Railway Shocking to Passengers
ఇదిలా ఉండగా సాధారణ రైళ్లలో రెండవ తరగతి లేదా జనరల్ తరగతికి 500 కి.మీ వరకు ఛార్జీల పెరుగుదల లేదు. ఆ తర్వాత, 501 కి.మీ నుండి 1,500 కి.మీ మధ్య దూరాలకు రూ. 5, 1,501 కి.మీ నుండి 2,500 కి.మీ మధ్య దూరాలకు రూ. 10 , 2,501 కి.మీ నుండి 3,000 కి.మీ మధ్య దూరాలకు రూ. 15 చొప్పున ఛార్జీలు పెంచింది రైల్వే శాఖ. జూలై 1 తర్వాత మునుపటి ధరలపై ప్రయాణాలకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిపై సవరించిన ఛార్జీలు ప్రభావం చూపవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
రైల్వే ప్రయాణీకుల కిలోమీటర్ల అంచనా ప్రకారం జూలై 1 నుండి ప్రారంభమయ్యే పెంపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మిగిలిన కాలానికి రూ. 1,100 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి, అదనపు ఆదాయం రూ.1,450 కోట్లకు పైగా ఉండేది.
Also Read : Indian Govt Breakthrough : ఇవాళ్టి నుంచి(జూలై 1) దేశవ్యాప్తంగా ఆ అంశాలపై కీలక మార్పులు
















