Upendra Dwivedi : ఢిల్లీ : భారతీయ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi ) సంచలన వ్యాఖ్యలు చేశారు. దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన నోరు విప్పారు. ఇంకోసారి భారత దేశం వైపు చేసినా లేదా గీత దాటేందుకు యత్నించినా భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలోని మానేక్ షా సెంటర్ లో ‘ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్తాన్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ఆర్మీతో పాటు నేవి, తదితర విభాగాలన్నీ పూర్తిగా బలవంతంగా ఉన్నాయని స్పష్టం చేశారు. పదే పదే అణుబాంబు బూచి చూపి భయపెట్టాలని చూస్తోందని, తమ సత్తా ఏమిటో ఇప్పటికే పాకిస్తాన్ కు తెలిసి పోయిందన్నారు.
Indian Army Chief Upendra Dwivedi Warning
ప్రపంచంతో ఏ దేశంతోనైనా పోటీ పడేందుకు భారత దేశం సర్వం సిద్దంగా ఉందని చెప్పారు ఉపేంద్ర ద్వివేది. మనం యుద్ధం చేసినప్పుడు, సైన్యం ఒంటరిగా పోరాడదు. మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ , ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఉన్నాయని తెలిపాడు ఆర్మీ చీఫ్. ట్రై-సర్వీసెస్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీలు, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీలు కీలకంగా మారుతున్నాయని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇస్రో, సివిల్ డిఫెన్స్, సివిల్ ఏవియేషన్, రైల్వేస్, ఎన్సీసీ, రాష్ట్ర, కేంద్ర పరిపాలన వంటి ఏజెన్సీలు ఉన్నాయని చెప్పారు. చాలా ఏజెన్సీలతో వ్యవహరించాల్సి వస్తే, థియేటర్‌రైజేషన్ సమాధానం. ఎందుకంటే కమాండ్ ఐక్యత చాలా ముఖ్యమైనదని స్పష్టం చేశారు. బీజింగ్ అడ్డంకులను ఎత్తివేసింది, భారతదేశంతో వాణిజ్యం పునః ప్రారంభం ఇతర రెండు దళాల అధిపతులు థియేటర్లైజేషన్ పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన దాదాపు రెండు వారాల తర్వాత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : YS Jagan Fired on CM Chandrababu : సంపద సృష్టిస్తానని స్వాహా చేస్తే ఎలా..?
















