Income Equality : భారత్ ఆర్థిక సమానత్వం దిశగా వేగంగా పురోగమిస్తూ, ప్రపంచంలోని అతిపెద్ద దేశాలను వెనక్కినట్టే చేసింది. పేదరికం తగ్గింపు, ఆదాయ పంపిణీలో సమతుల్యత వంటి అంశాల్లో భారత్ (India) సాధించిన పురోగతిని ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Income Equality Updates
ఈ నివేదిక ప్రకారం, గత దశాబ్దంలో భారత్‌లో (India) తీవ్ర పేదరికం నుంచి సుమారు 17 కోట్ల మందికి పైగా బయటపడినట్లు వెల్లడైంది. 2011-12లో దేశంలో తీవ్ర పేదరిక స్థాయి 16 శాతంగా ఉన్నప్పటికీ, 2022-23 నాటికి అది కేవలం 2.3 శాతానికి పడిపోవడం గమనార్హం.
భారత్ తీసుకున్న పలు ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలు — ప్రధానంగా పీఎం జన్‌ధన్ యోజన, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ), ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, స్టాండప్ ఇండియా లాంటి పథకాలు — ఈ అభివృద్ధికి దోహదం చేశాయి. ఇవి పేదలకు నేరుగా మద్దతుగా నిలిచి, ఆదాయ అసమానతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.
Income Equality – గిని సూచీలో భారత్ అగ్రస్థానాల్లో
ఆదాయ సమానత్వం పరంగా గిని ఇండెక్స్ ఆధారంగా ప్రపంచ దేశాలను వరల్డ్ బ్యాంక్ శ్రేణి బద్ధం చేసింది. ఇందులో భారత్ 25.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌కు ముందు స్లోవక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ ఉన్నాయి.
ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే ఈ ర్యాంకింగ్ ఎంతో గర్వించదగ్గది. ఉదాహరణకు, చైనా 35.7 పాయింట్లతో 65వ స్థానంలో, అమెరికా 41.8 పాయింట్లతో 90వ స్థానంలో ఉన్నాయి. ఇది భారతదేశంలో ఆదాయం పంపిణీలో సమానత్వం ఎంత మెరుగైందో తెలియజేస్తుంది.
గిని సూచీ అంటే ఏమిటి?
గిని సూచీ (Gini Index) అనేది ఆదాయ పంపిణీలో సమానత్వాన్ని కొలిచే ప్రమాణం. ఇది 0 నుంచి 100 వరకు స్కోరు కలిగి ఉంటుంది.
- 0 అంటే సంపూర్ణ సమానత్వం — అంటే ప్రతి ఒక్కరికీ సమాన ఆదాయం
- 100 అంటే సంపూర్ణ అసమానత్వం — అంటే ఒకరే అన్నివిధాలా సంపదను కలిగి ఉండడం
గిని స్కోరు తక్కువగా ఉండటం అంటే ఆ దేశంలో ఆదాయ వ్యత్యాసాలు తక్కువగా ఉన్నట్లు అర్థం.
దేశాలకు ఆదర్శంగా భారత్
ప్రపంచవ్యాప్తంగా ఆదాయ సమానత్వం పరంగా తక్కువ గిని స్కోరు ఉన్న దేశాల్లో ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, పోలాండ్ వంటి దేశాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన భారత్ కూడా నిలిచింది. పేదరికాన్ని తగ్గిస్తూ, సమాన అవకాశాలను కల్పించే దిశగా భారత్ తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి.
ఈ గణాంకాలు దేశ అభివృద్ధిలో సమానతకు ప్రాధాన్యత ఎంత ముఖ్యమో, అలాగే పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎంత ప్రభావవంతంగా మారవచ్చో తెలియజేస్తున్నాయి.
Also Read : PM Modi Special Wishes : దలైలామా కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు



















