India Independence Day Interesting : రేపే స్వాతంత్ర దినోత్స‌వ పండుగ‌

స‌మున్న‌త భార‌తావ‌ని స‌న్న‌ద్దం

Hello Telugu - India Independence Day Interesting

Hello Telugu - India Independence Day Interesting

Independence Day : హైద‌రాబాద్ – యావ‌త్ భార‌త దేశం పంధ్రాగ‌స్టు కోసం సిద్ద‌మైంది. ప్ర‌తి ఆగ‌స్టు 15న స్వాతంత్ర దినోత్స‌వం జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఆంగ్లేయుల దాస్య శృంఖ‌లాల నుంచి విముక్తి పొందిన రోజు. జాతిని ఉద్దేశించి భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర దామోద‌ర దాస్ మోదీ (PM Narendra Modi) ప్ర‌సంగిస్తారు. త్రివిధ ద‌ళాలు ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తాయి. వివిధ రాష్ట్రాల‌కు చెందిన శ‌క‌టాలు ఇందులో పాల్గొంటాయి. మ‌న దేశం సాధించిన విజ‌యాలు ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తావిస్తారు. ఈ రోఉ 1947లో వలస పాలనపై భారతదేశం సాధించిన విజయాన్ని సూచిస్తుంది.

India Independence Day Updates

మువ్వొన్నెల ప‌తాకాలు రెప రెప లాడుతాయి. ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కార్ ఏర్పాట్లలో నిమ‌గ్న‌మై ఉంది. త్రివ‌ర్ణ ప‌తాకానికి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. దీనిని త‌యారు చేసింది ఎవ‌రో కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన పింగ‌ళి వెంక‌య్య చౌద‌రి. ఆనాడు మ‌హాత్మా గాంధీకి ఇచ్చారు. ఇదే నేటికీ కోట్లాది ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య దైవంగా భాసిల్లుతూ వ‌స్తోంది. స‌మున్న‌త భార‌తావ‌ని 143 కోట్ల మంది భార‌తీయులు స‌గ‌ర్వంగా సలాం చేసేందుకు సిద్ద‌మై ఉన్నారు.

దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవిస్తుంది. ఈ రోజున, దేశవ్యాప్తంగా, ఇళ్ల నుండి వాణిజ్య ప్రదేశాల వరకు, జాతీయ జెండా, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు జాతీయ గీతాన్ని గర్వంగా ఆలపిస్తారు. ఆగస్టు 15, 1947, దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలికింది. భారతదేశం ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సాంప్రదాయ ప్రోటోకాల్ ప్రకారం, జాతీయ జెండాను సూర్యోదయం సమయంలో ఎగుర వేయాలి. సూర్యాస్తమయం సమయంలో అవనతం చేయాలి. అయితే, 2022లో భారత జెండా కోడ్‌కు చేసిన సవరణను అనుసరించి, తగినంతగా వెలిగించినట్లయితే జెండాను ఇప్పుడు రాత్రిపూట ఎగురవేయవచ్చు.

Also Read : UPI Shocking : అక్టోబర్ 1నుంచి యూపీఐలో ఆ ఆప్షన్ కనబడదు

Exit mobile version