India Govt : ఢిల్లీ : తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ లో టీవీకే విజయ్ ప్రచార ర్యాలీ తీవ్ర విషాదం నెలకొంది. ఏకంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఆరుగురు చిన్నారులతో పాటు 16 మంది మహిళలు మృతి చెందారు. ఈ మొత్తం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తీవ్ర ఆవేదనను నింపింది. పలు కుటుంబాలలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై స్పందించింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (India Govt). ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నివేదిక ఇవ్వాలని తమిళనాడు డీఎంకే ప్రభుత్వాన్ని ఆదేశించింది. తక్షణమే ఇవ్వాలని పేర్కొంది. ఇదిలా ఉండగా టీవీకే విజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెంటనే స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని ఆదేశించారు.
India Govt Strong Warning on Karur Incident
ఇదిలా ఉండగా తమిళనాడు డీజీపీ వెంకట రామన్ స్పందించారు. తాము టీవీకే విజయ్ ప్రచార సభకు కేవలం 10 వేల మందిని మాత్రమే అనుమతి ఇచ్చామని, కానీ 50 వేల మందికి పైగా వచ్చారని, ఈ ఘటనలో ఎలాంటి పోలీసుల వైఫల్యం లేదని స్పష్టం చేశారు. ముఖ్య కారకుడు టీవీకే పార్టీ చీఫ్ అంటూ బాంబు పేల్చారు. మరో వైపు మృతుల కుటుంబాలను, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను అన్నాడీఎంకే నేత పళనిస్వామి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో పాటు పలువురు నేతలు పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చారు. సీఎం స్టాలిన్ సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో కేంద్రం నివేదిక కోరడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Delhi CM in Bathukamma Interesting : బతుకమ్మ వేడుకల్లో ఢిల్లీ సీఎం

















