IND vs ENG : ఇంగ్లండ్ – ఇంగ్లండ్ లోని ఓవెల్ వేదికగా జరిగిన కీలకమైన ఐదో టెస్టు మ్యాచ్ లో ఎవరూ ఊహించని విధంగా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శుభ్ మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ను ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠను రేపింది. ఎవరు గెలుస్తారనే దానిపై . దీంతో 5 టెస్టు మ్యాచ్ ల సీరీస్ ను 2-2 తో సమం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే గౌతం గంభీర్ హెడ్ కోచ్ గా నియమాకం అయిన తర్వాత శుభ్ మన్ గిల్ కు సారథ్యం దక్కడం , గెలుపు సాధించడం చరిత్రాత్మకం అని చెప్పక తప్పదు.
IND vs ENG 5th Test India Won
ఇంగ్లండ్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ముందు ఉంచింది. 374 పరుగులు చేసేందుకు చివరి దాకా పోరాడింది ఆతిథ్య టీం. ఇంగ్లండ్ భారత బౌలర్ల అద్భుతమైన బౌలింగ్ దెబ్బకు తల వంచింది. 367 పరుగుల వద్ద తను ఆగి పోయింది. క్రిస్ వోక్స్ కొంత మేరకు ఆడేందుకు ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదు. టీమిండియా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు హైదరాబాద్ కు చెందిన స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ దుమ్ము రేపాడు. అద్భుతమైన బంతులతో ఆకట్టుకున్నాడు. కీలక వికెట్లును తీశాడు. అయితే ఇదే సమయంలో 4వ రోజున ఫీల్డింగ్ లో తప్పు దొర్లింది తన కారణంగా. హ్యారీ బ్రూక్ కు లైఫ్ ఇచ్చాడు. తను ఇదే ఛాన్స్ అనుకుని సెంచరీ నమోదు చేశాడు.
చివరి 5వ రోజున ఆట మరింత రసవత్తరంగా మారింది. మహ్మద్ సిరాజ్ కళ్లు చెదిరేలా బంతులు విసిరాడు. సూపర్ షోతో ఆకట్టుకున్నాడు. తను 4 వికెట్లు కూల్చితే ప్రసిద్ద్ కృష్ణ కూడా 4 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్ పరాజయం పరిసమాప్తమైంది.
Also Read : CM Chandrababu Alarming : సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ – సీఎం
