IND vs ENG : ఎడ్జ్ బాస్టన్ – శుభ్ మన్ గిల్ సారథ్యంలోని భారత (India) జట్టు రెండో టెస్టు మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆరు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. ఎడ్జ్ బాస్టెన్ లో జరిగిన రెండో టెస్టులో చారిత్రాత్మక గెలుపును స్వంతం చేసుకుంది. కెప్టెన్ గిల్ సూపర్ గా ఆడాడు. అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో ఆకట్టుకున్నాడు. తను తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేశాడు. భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
IND vs ENG 2nd Test Updates
అనంతరం బిగ్ టార్గెట్ ముందుంచింది టీమిండియా ఇంగ్లండ్ పై. ఇదే సమయంలో భారత స్టార్ బౌలర్ ఆకాష్ దీప్ సూపర్ స్పెల్ తో దుమ్ము రేపాడు. ఇంగ్లండ్ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 99 పరుగులు మాత్రమే ఇచ్చిన తను 6 కీలక వికెట్లు తీశాడు. దీంతో ఆతిథ్య జట్లు తల వంచక తప్పలేదు. మొత్తంగా ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంది. స్టోక్స్ టీంపై ఏకంగా 336 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ఐదు టెస్టుల మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ నమోదు చేయగా రెండో టెస్టులో సత్తా చాటింది టీమిండియా. దీంతో ఇరు జట్లు చెరి సమానంగా ఉన్నాయి. ఇంకా మూడు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
ఐదు టెస్టుల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో బోణీ కొట్టింది. అయితే చివరి వరకు పోరాడింది ఇంగ్లండ్. కానీ వర్కవుట్ కాలేదు. బ్రూక్ 23 రన్స్ చేయగా స్టోక్స్ 35 పరుగులు చేశాడు. జెమీ స్మిత్ మాత్రం 88 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ ఎన్ని సార్లు ట్రై చేసినా ఫలించలేదు. చివరకు వాషింగ్టన్ సుందర్ బ్రేక్ ఇచ్చాడు.
Also Read : Shami Ex Wife Shocking Allegations : షమీ నన్ను చంపించాలని చూస్తున్నాడు



















