IND vs ENG : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ కు బిగ్ షాక్ తగిలింది. నలుగురు టీమిండియా ప్లేయర్లు సెంచరీలు చేశారు. భారీ స్కోర్ చేసినా జట్టును గట్టెక్కించ లేక పోయారు. పేలవమైన బౌలర్ల బౌలింగ్ తో ఓటమి చవి చూశారు. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకే ఒక్కడు డకెట్. వచ్చీ రావడంతోనే మైదానంలో అటాకింగ్ మొదలు పెట్టాడు. ఇది టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ గమనించ లేక పోయాడు.
IND vs ENG 1st Test
ఎక్కడా తొట్రుపాటుకు లోనుకాకుండా పూర్తిగా పాజిటివ్ అటిట్యూడ్ తో కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. తమ ముందున్న లక్ష్యం మామూలుది కాదు. ఏకంగా ఒకే ఒక్క రోజులో 371 పరుగులు చేయాలి. ఇంకొకరైతే డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ప్రత్యర్థి జట్టు అలా కాదు. ఎలాగైనా సరే విజయం సాధించాలంతే.
వికెట్లు పడితే ఎందుకు వచ్చిన తంటా అనుకుంటూ అడపా దడపా ఆడాలని అనుకుంటాయి. కానీ ఇందుకు పూర్తిగా విరుద్దంగా ఆడాడు ఇంగ్లండ్ (England) క్రికెటర్ డకెట్. ప్రస్తుతం బజ్ బాల్ ఆటతో దూసుకు పోతోంది . తన గురి మాత్రం తప్పలేదు. గత మూడు సంవత్సరాల కిందట బర్మింగ్ హోమ్ వేదికగా భారత్ (India) పై 378 పరుగుల టార్గెట్ ను ఛేదించి విజయ కేతనం ఎగుర వేసింది. తాజాగా హెడింగ్లీలోనూ కథను పునరావృతం చేసింది.
భారత జట్టు ఆటగాళ్లు, అభిమానులపై నీళ్లు చల్లింది ఇంగ్లండ్ జట్టు. భారత బౌలర్ల భరతం పట్టాడు డకెట్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంగ్లండ్ విజయం కాదు డకెట్ విజయమని చెప్పక తప్పదు. తను 170 బాల్స్ ఎదుర్కొని 149 రన్స్ చేశాడు. కీ రోల్ పోషించాడు. ఇందులో 21 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. తనతోపాటు జాక్ క్రాలీ కూడా దుమ్ము రేపాడు. 126 బంతులు ఆడి 65 రన్స్ చేశాడు. జో రూట్ 53 పరుగులతో నాటౌట్ గా నిలిస్తే జెమీ స్మిత్ 44 రన్స్ తో కీ రోల్ పోషించాడు.
Also Read : Saketh Myneni Success :టెన్నిస్ ప్లేయర్ సాకేత్ కు గ్రూప్ -1 పోస్ట్



















