బిగ్ బాస్ – 9 ఫినాలే ఓటింగ్ లో త‌నూజ వెనుకంజ‌

క‌ళ్యాణ్‌, ఇమ్మాన్యూయెల్ లు టాప్ లో

hellotelugu-BigBoss9Tanuja

హైద‌రాబాద్ : అంద‌రినీ విస్తు పోయేలా చేస్తోంది బిగ్ బాస్ -9 రియాల్టీ షో ఆఖ‌రు అంకం. ఇప్ప‌టికే ఓటింగ్ కు సంబంధించి ప్రారంభ‌మైంది. చివ‌ర‌కు ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైన‌ల్ కోసం పోటీ ప‌డ్డారు. కానీ ముగ్గురు ఆఖ‌రున నిలిచారు. వారిలో త‌నూజ‌, క‌ళ్యాణ్ , ఇమ్మాన్య్యూయెల్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ -9 రియాల్టీ షో గ్రాండ్ ఫినాలే ఈనెల 21న రాత్రి 7 గంట‌ల‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌కటించారు నిర్వాహ‌కులు. ఆరోజే విజేత ఎవ‌రో తేలి పోనుంది. చివ‌రి దాకా టాప్ లో కొన‌సాగుతూ వ‌చ్చింది త‌నూజ‌. ఆమెనే ఫైన‌ల్ విన్న‌ర్ అవుతుంద‌ని అంతా అనుకున్నారు. సోష‌ల్ మీడియాలో సైతం టాప్ లో ట్రెండింగ్ లో కొన‌సాగింది.

కానీ ఏమైందో ఏమో కానీ తాజాగా ఓటింగ్ అంచ‌నాలు ఊహించ‌ని విధంగా త‌ల‌కిందులు అయ్యాయి. ఇప్పుడు నిన్న‌టి దాకా టాప్ లో కొన‌సాగుతూ వ‌చ్చిన త‌నూజ ఉన్నట్టుండి వెనుకంజ‌లో ఉంది. ఇప్పుడు టాప్ ప్లేస్ కోసం ఇద్ద‌రి మ‌ధ్య పోటీ నెల‌కొన‌డం విస్తు పోయేలా చేసింది. ప్ర‌స్తుతం ఫైన‌ల్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లో దూసుకు పోతున్నారు క‌ళ్యాణ్‌, ఇమ్మాన్యూయెల్. ఇక సోషల్ మీడియాలో తమ అభిమాన కంటెస్టెంట్‌లకు ఓటు వేయమని ప్రేక్షకులను కోరుతూ ప్రచారం చేస్తున్నారు. పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ సీజన్ ట్రోఫీని చివరికి ఎవరు గెలుచుకుంటారనే దానిపై అందరి దృష్టి నెల‌కొంది. ప్రారంభంలో అనధికారిక పోల్స్‌లో అత్యధిక ఓట్లతో తనుజ ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ఆమె నెమ్మదిగా తన ఆధిక్యాన్ని కోల్పోతోంది. కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ దూసుకుపోతున్నారు, ఇటీవలి ఓటింగ్ ట్రెండ్స్‌లో అగ్రస్థానాలను కైవసం చేసుకుని తనుజను అధిగమించారు.

Exit mobile version