Imran Khan : పాకిస్తాన్ : జైలుపాలైన తన తండ్రి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) బతికే ఉన్నాడని జైలు అధికారులు నిరూపించాలని డిమాండ్ చేశారు ఖాన్ కొడుకు కాసిం ఖాన్. గత కొంత కాలంగా 73 ఏళ్ల మాజీ క్రికెటర్-రాజకీయ నాయకుడు జైలులో హత్యకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత నెల రోజులుగా కుటుంబీకులు, స్నేహితులు, న్యాయవాదులను తనను చూసేందుకు జైలు అధికారులు అనుమతించ లేదు. దీంతో మరింత అనుమానాలకు తావిచ్చేలా చేసింది. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కార్యకర్తలతో పాటు ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది గత కొన్ని రోజులుగా అడియాలా జైలు వెలుపల మకాం వేశారు. ఆందోళనలు చేపట్టారు. తమ నాయకుడిని చూపించాలని కోరారు.
Imran Khan Son Qasim Khan Strong Demand
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తన కుటుంబ సభ్యులు తనను కలవడానికి అనుమతించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ జీవితానికి సంబంధించిన రుజువు చూపించాలని కోరుతున్నామన్నారు వారంతా. తన తండ్రి గత 845 రోజులుగా జైలులో బందీగా ఉన్నాడు. గత ఆరు వారాలుగా ఎలాంటి సమాచారం మాకు అందడం లేదు. తాము కలవాలని కోరామని, అయినా ఒప్పుకోవడం లేదని వాపోయారు. దీన్ని బట్టి చూస్తే తన తండ్రిని జైలులోనే ఖతం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే జైలు అధికారులు, దేశ సర్కార్ జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాసిం ఖాన్. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టును ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
Also Read : Hero Chiranjeevi Movie – Zee : చిరంజీవి మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ జీ స్వంతం
















