Best Tourist Places : వర్షం వచ్చినప్పుడల్లా ప్రకృతి తన అందాన్ని పూర్తిగా ఆవిష్కరిస్తుంది. ఈ సమయంలో సహజసిద్ధమైన అందాలను ఆస్వాదించాలంటే కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను తప్పక సందర్శించాలి. వాటిలో మహారాష్ట్రలోని లోనావాలా, ముల్షీ, మాథెరాన్, హరిశ్చంద్రగడ్ మరియు పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ బటాసియా లూప్ ప్రముఖంగా నిలుస్తున్నాయి.
Best Tourist Places – లోనావాలా – ప్రేమికులకి స్వర్గధామం
పూణే సమీపంలోని లోనావాలా (Lonavala) వర్షాకాలపు పర్యటనకు అద్భుతమైన గమ్యం. భూషి ఆనకట్ట, టైగర్ పాయింట్, పచ్చటి కొండలు, అలరించే పూల తోటలు ఈ ప్రాంతానికే ప్రత్యేకతను తీసుకువస్తాయి. ముఖ్యంగా జంటలు తమ భాగస్వామితో కలిసి సుందర దృశ్యాలను ఆస్వాదించేందుకు ఇక్కడకు రావడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది.
ముల్షీ – సహజసౌందర్యానికి మారుపేరు
పూణే సమీపంలోని ముల్షీ ప్రాంతం వర్షకాలంలో నిండా పచ్చగా, పొగమంచుతో కమ్ముకుపోయిన కొండల మధ్య ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ముల్షీ డ్యామ్ పరిసర ప్రాంతాలు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. సహజసిద్ధ ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే విధంగా ఉంటుంది.
మాథెరాన్ – చేతిలో చేయి వేసుకుని నడవాలంటే ఇదే బెస్ట్
ముంబై, పూణే మధ్య ఉన్న హిల్ స్టేషన్ మాథెరాన్ వర్షాకాల పర్యటనకు అద్భుతమైన ఎంపిక. ఇక్కడ పచ్చటి కొండలు, ప్రకృతి రమణీయత మధ్య భాగస్వామితో నడవడం మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. ప్రేమికులకు ఇది బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది.
హరిశ్చంద్రగడ్ – ట్రెక్కింగ్ ప్రేమికులకోసం
ట్రెక్కింగ్ ప్రేమికుల కోసం హరిశ్చంద్రగడ్ అద్భుతమైన పర్యాటక ప్రదేశం. వర్షాకాలంలో ఇక్కడి కొండలు, కాఫీ తోటలు, పచ్చటి అడవులు మరింత అందంగా మెరిసిపోతుంటాయి. కొంకణ్ తీర అందాలను తిలకిస్తూ ప్రేమభరితంగా గడిపేందుకు ఇది చక్కటి ప్రదేశం.
డార్జిలింగ్ బటాసియా లూప్ – ప్రకృతి ప్రేమికులకోసం ప్రత్యేకంగా
వర్షాకాలంలో రైలులో ప్రయాణించాలంటే డార్జిలింగ్‌లోని బటాసియా లూప్ ఉత్తమ గమ్యం. ఇక్కడ రైల్వే ట్రాక్ వాలుగా ప్రయాణిస్తూ పర్వతాల మధ్య జలపాతాలు, పచ్చని అడవులు చూడడం ఒక అపూర్వ అనుభూతి. ప్రేమికుల కోసం ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా చెప్పవచ్చు.
Also Read : Popular Bike Harley Davidson : హార్లే డేవిడ్సన్ బైక్ ను ఇష్టపడే వారికి ఇదొక శుభవార్త



















