హైదరాబాద్ : ఈ దేశంలో ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండి తీరాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
చట్టం మౌనంగా ఉంటుంది. కానీ తీర్పు మాత్రం గర్జిస్తుంది. ఖాకీలకు అధికారం ఇచ్చింది చట్టం, రాజకీయ పార్టీలు కాదని తెలుసుకుంటే మంచిది. నాయకులకు వంగి వంగి దండాలు పెట్టడం మానుకోవాలి. లేకపోతే కష్టాలు తప్పవు. నేతల ఆర్డర్లు తాత్కాలికం అని గుర్తించాలి. కోర్టు తీర్పు శాశ్వతమని గుర్తించాలి. అధికారంతో ఆడితే చట్టం తోడుగా రాదు, ఎదురు నిలుస్తుంది. కుర్చీకే విలువ ఎక్కువ. కుర్చీ మీద ఉన్నంత వరకే పవర్ పని చేస్తుంది. అది పోయాక నీకు సలాం చేసిన వాళ్లే నిన్ను పట్టించుకోరు.
చట్టం ముందు అందరూ సమానులేనని ఖాకీలు తెలుసుకుంటే మంచిది. చేతిలో లాఠీ ఉంది కదా అని రెచ్చి పోతే చివరకు చట్టం చేతిలో ఖూనీ కావాల్సి వస్తుందని తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో తేలి పోయింది. రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా , మంత్రులైనా , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలైనా, లేదా ఈ దేశానికి చెందిన డబ్బున్న వాళ్లయినా , ఎవరైనా చట్టం ముందు సమానులేనని తేల్చి చెప్పింది ధర్మాసనం. నేడు దౌర్జన్యం చేసిన చేతులు రేపు సమాధానం చెప్పాల్సిందే. చెప్పి తీరాల్సిందే. యూనిఫాంలో ఉన్నా తప్పు చేస్తే శిక్ష తప్పదు. చట్టం మౌనంగా ఉందని అనుకుంటే పొరపాటు పడినట్లే. నాయకుడి మాట కోసం వంగితే చట్టం ముందు నిలబడాల్సిందే.
