ICICI Bank : ఢిల్లీ – తాజాగా ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తీసుకున్న నిర్ణయం తీవ్ర ఆగ్రహానికి గురి చేసేలా చేసింది. కొత్తగా బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తే మినిమం బ్యాలెన్స్ ఏకంగా రూ. 50000 ఉండాలని కీలక ప్రకటన చేసింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొత్త, పాత ఖాతాదారులు. ఇది పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ కు వ్యతిరేకమని మండిపడుతున్నారు. కనీస బ్యాలెన్స్ నిబంధన పట్ల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ICICI Bank Shocking
పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ అవసరాన్ని భారీగా పెంచాలనే ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) నిర్ణయం పౌరుల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రుణదాతగా దీనికి పేరుంది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్లు ఇప్పుడు సగటున రూ. 50,000 బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుందని ప్రకటించింది. ఇది మునుపటి రూ. 10,000 నుండి బాగా పెరిగింది. సెమీ-అర్బన్ ప్రాంతాలలో కొత్త కస్టమర్ల కోసం రూ.25,000గా నిర్ణయించ బడింది. గ్రామీణ ప్రాంతాల్లో రెండు వర్గాలలోనూ రూ. 5,000 నుండి రూ. 10,000కి పెంచింది ఐసీఐసీఐ బ్యాంకు.
సవరించిన ఈ రూల్స్ ఈనెల ఆగస్టు 1 నుంచి అమలవుతాయని స్పష్టం చేసింది. అంటే ఈ తేదీ నుంచి ఎవరైతే ఐసీఐసీఐ బ్యాంకులో కొత్త ఖాతాలు తెరుస్తారో వారికి వర్తిస్తుందని , పాత ఖాతాదారులకు సంబంధించి మినిమం బ్యాలెన్స్ రూల్ రూ. 10 వేలు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. మరో షాక్ ఇచ్చింది ఈ బ్యాంకు. ఒకవేళ మినిమం బ్యాలెన్స్ ను మెయింటెన్ చేయక పోతే 6 శాతం లేదా రూ. 500 జరిమానాగా విధిస్తామని పేర్కొంది.
Also Read : CM Chandrababu Strong Promise : ఆదివాసీలకు 54 వేల ఇళ్లు నిర్మిస్తాం – సీఎం


















