ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) , ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ జే షా మర్యాద పూర్వకంగా వరల్డ్ టాప్ మోస్ట్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని కలిశారు. ఈ సందర్బంగా మెస్సీ గోట్ కార్యక్రమంలో భాగంగా మెస్సీ ఇండియాలో పర్యటించారు. ముందుగా తను కోల్ కతా వెళ్లారు. లక్షలాది అభిమానులకు అభివాదం చేశాడు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు వెళ్లారు. తనకు ఘన స్వాగతం లభించింది. భారీ భద్రత మధ్య ఘనమైన కీర్తిని స్వంతం చేసుకున్న చౌమొహల్లా ప్యాలెస్ కు విచ్చేశారు. అక్కడ ఎంపీ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలతో కరచాలనం చేశారు. ప్రముఖులతో ముఖాముఖి అనంతరం ఉప్పల్ లో ని రాజీవ్ గాంధీ స్టేడియంకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ టీం ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు.
స్టేడియం లో మెస్సీ అంటూ నినాదాలతో దద్దరిల్లి పోయింది. తిరిగి చౌమొహల్లా ప్యాలెస్ కు చేరుకున్నాడు మెస్సీ. తనకు ఘనంగా వీడ్కోలు పలికింది సర్కార్. ఈ సందర్బంగా లియోనెల్ మెస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇన్నేళ్లుగా ఎన్నో నగరాలు తిరిగానని, కానీ ఎక్కడా హైదరాబాద్ లో లభించినంత ప్రేమ కనిపించ లేదన్నాడు. హైదరాబాద్ ను వీడిన మెస్సీ ముంబైకి చేరుకున్నాడు. తనకు ఊహించని రీతిలో అక్కడి సర్కార్ సాదర స్వాగతం పలికింది. ఈ సందర్బంగా ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆహ్వాన టికెట్‌ను, , దానితో పాటు సంతకం చేసిన బ్యాట్ , బీసీసీఐ టీమ్ జెర్సీని ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి అందించారు ఐసీసీ చైర్మన్ జే షా. ఈ రెండు గొప్ప క్రీడా సంస్కృతుల కలయిక లక్షలాది మంది పిల్లలను క్రీడలు ఆడటానికి ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు ఐసీసీ చైర్మన్.


















