హైదరాబాద్ : ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను మూడు రోజుల పర్యటనలో భాగంగా ముందు కోల్ కతాకు వెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చాడు. తనకు ఘన స్వాగతం లభించింది. భారీ ఎత్తున అభిమానులు తనకు నీరాజనాలు పలికారు. చౌమొహల్లా ప్యాలెస్ లో గ్రాండ్ గా విందు , వసతి ఏర్పాటు చేసింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్. అక్కడ ఫోటో షూట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయనతో కొద్ది సేపు సంభాషించారు. తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.
భారీ భద్రత మధ్యన చౌమొహల్లా ప్యాలెస్ నుంచి రాహుల్ గాంధీ, సీఎంతో కలిసి మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకున్నారు. భారీ ఎత్తున గ్రాండ్ వెల్ కమ్ లభించింది. స్టేడియం అంతా కలియ తిరిగారు. కాసేపు సరదాగా సీఎం టీంతో కలిసి మ్యాచ్ ఆడారు. అనంతరం మెస్సీ మాట్లాడారు. నేను 4 స్టేడియంలకు వెళ్లాను అన్ని చోట్ల ఆదరణ పొందాను. కానీ హైదరాబాద్ లో మీ ప్రేమను పొందాను. ఇలాంటి నగరం ఎక్కడ చూడలేదని అన్నారు. ముఖ్యంగా నిర్వాహకులకు, హైదరాబాద్ పోలీస్ సిబ్బందికి, సీఎం రేవంత్ రెడ్డికి నా మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. తన ఫిట్ నెస్ బాగుందంటూ కితాబు ఇచ్చారు.



















