మెస్సీ కంటే రొనాల్డో ద‌యా గుణం ఇష్టం

ఎంపీ రాహుల్ గాంధీ కామెంట్స్ వైర‌ల్

hellotelugu-RahulGandhi

ఢిల్లీ : కాంగ్రెస్ అగ్ర నేత‌, అమేథి ఎంపీ రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో మెస్సీ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. శ‌నివారం ప్ర‌పంచంలోనే టాప్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సీ భార‌త్ కు విచ్చేశారు. మెస్సీ గోట్ పేరుతో ఆయ‌న మూడు రోజుల పాటు భార‌త దేశంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందులో భాగంగా త‌ను హైద‌రాబాద్, కోల్ క‌తా, ముంబై, ఢిల్లీ న‌గ‌రాలను సంద‌ర్శిస్తారు. అంతే కాకుండా ప్ర‌ముఖుల‌ను క‌లుసుకుంటారు. విచిత్రం ఏమిటంటే తాను హైద‌రాబాద్ లో కాలు మోపారు. ఈమేర‌కు సీఎం రేవంత్ రెడ్డితో ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌నున్నారు .

ఈ మ్యాచ్ ను ప్ర‌త్యేకంగా చూసేందుకు అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ హైద‌రాబాద్ కు రానున్నార‌ని తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలో, రెండేళ్ల క్రితం ఒక కాన్‌క్లేవ్‌లో తన అభిమాన ఆటగాడి గురించి ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రొనాల్డో, మెస్సీలలో ఎవరంటే ఇష్టమని రాహుల్‌ను అడగ్గా.. ఆయన రొనాల్డో అని సమాధానమిచ్చారు. మెస్సీ అతడి కంటే మంచి ప్లేయర్ అయినప్పటికీ, తనకు రొనాల్డోని దయాగుణం ఇష్టమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో త‌ను మెస్సీని క‌ల‌వ‌బోతున్నారు.

Exit mobile version