CM Chandrababu : తిరుపతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఆయన శ్రీవారిని గుర్తు చేసుకున్నారు. ఆయన వల్లనే బతికానని, సీఎం అయ్యానని చెప్పారు. నేను తిరుపతిలోనే చదువుకున్నానని చెప్పారు. అంచలంచెలుగా ఎదిగి నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానంటే అంతా వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదమే తప్పా మరోటి కాదన్నారు. మన చుట్టుపక్కల పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
CM Chandrababu Key Comments
అప్పుడే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటాం అన్నారు. జగన్ బంగారుపాళ్యం పర్యటనలో పులివెందుల రాజకీయం చేశారని ఆరోపించారు. రోడ్డుపై మామిడికాయలు పారబోయడం విడ్డూరంగా ఉందన్నారు. రౌడీల గుండెల్లో నిద్రపోయి.. తిరుపతిని కాపాడా. గత ఐదేళ్లు స్వేచ్ఛ అన్నదే లేదన్నారు.. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి నిలబెట్టుకున్నాం అన్నారు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). రాయలసీమకు నీళ్లు తెచ్చిన పార్టీ టీడీపీ అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
నేనెప్పుడైనా నేరాలు చేశానా , హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయా? నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి ఎవర్నైనా చంపానా అని ప్రశ్నించారు. తన దృష్టి ఎప్పుడూ అభివృద్ది చేయడంపై ఉంటుందన్నారు. 24 గంటలు నిద్ర పోకుండా పని పై ఫోకస్ ఉంటుందన్నారు ఏపీ సీఎం.
గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీని అన్ని రంగాలలో నాశనం చేసిందని ఆరోపించారు సీఎం. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. కూటమి సర్కార్ వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ లభించిందని చెప్పారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రయత్నం చేశామన్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందన్నారు.
Also Read : MP Kesineni Chinni Interesting Statement : రైతుల సంక్షేమం సర్కార్ లక్ష్యం


















