Hydraa : హైదరాబాద్ : హైడ్రా జూలు విదిల్చింది. ఆక్రమణలు, కబ్జాలపై ఉక్కు పాదం మోపింది. తాజాగా మణికొండ మున్సిపాలిటీలో దశాబ్దాలుగా కబ్జాల చెరలో చిక్కుకు పోయిన ప్రభుత్వ భూమితో పాటు పార్కులకు హైడ్రా (Hydraa) విముక్తి కల్పించింది. దాదాపు రూ. 300ల కోట్ల విలువైన భూమిని కాపాడింది. ఇందులో ఒక ఎకరం ప్రభుత్వ భూమి కాగా 7650 గజాల పార్కు స్థలాలు ఉన్నాయి. మణికొండలోని పంచవటి కాలనీలో వెస్టర్న్ ప్లాజాకు చేరువలో ఉన్న 1 ఎకరా భూమికి ఎలాంటి పత్రాలు లేకుండా తమ పూర్వీకులదని చెప్పి కబ్జా చేసిన వారిని హైడ్రా ఖాళీ చేయించింది. ప్రభుత్వ భూమిలో కబ్జాదారులు తిష్ట వేసారంటూ వెస్టర్న్ ప్లాజాకు చెందిన వారు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
Hydraa Updates
దీంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పరిశీలించి ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు. ఆక్రమణలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. దీని విలువ దాదాపు రూ. 155 లక్షలు ఉంటుందని స్థానిక అధికారులు అంచనా వేశారు. మరో వైపు మణికొండ మున్సిపాలిటీలోనే వెంకటేశ్వర కాలనీలో 1600 ల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1992లో లే ఔట్ వేసినప్పుడు పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించి కేటాయించిన ఈ స్థలంలో అనుమతి లేని లే ఔట్‌తో కొంతమంది ఆక్రమణలకు పాల్పడ్డారు. పార్కు స్థలంలో బై నంబర్లు వేసుకుని కబ్జాలు చేశారంటూ హైడ్రా ప్రజావాణికి వెంకటేశ్వర కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
Also Read : Ex Minister Fired on Jogi Ramesh Arrest : మాజీ మంత్రి జోగి అరెస్ట్ అప్రజాస్వామికం


















