Hydraa : రంగారెడ్డి జిల్లా : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, బాలాపూర్ మండలాల్లో 976 గజాల పార్కుతో పాటు 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (Hydraa) కాపాడింది. వీటి విలువ రూ. 111 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మైలార్‌దేవుపల్లి విలేజ్‌లోని శాస్త్రీపురం కాలనీలో 976 గజాల పార్కు స్థలం చుట్టూ గతంలో మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ వేసింది. తప్పుడు డాక్యుమెంట్లతో కొంత మంది పార్కు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అక్కడి నివాసితులు హైడ్రా నిర్వహించిన ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు తీసుకుంది.
Hydraa Saves
1996లో వేసిన హుడా లే ఔట్‌లో పార్కు స్థలం కబ్జా అయ్యిందని ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఆ స్థలాన్ని హైడ్రా కాపాడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బాలాపూర్ మండలం జిల్లేలుగూడ విలేజ్‌లో సర్వే నంబరు 76లోని 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిలో కూడా ఆక్రమణలను హైడ్రా తొలగించింది. కొంత మంది ఫేక్ పట్టాలు సృష్టించి ప్లాట్లుగా విక్రయించడంతో పాటు.. ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందగానే ఈ చర్యలు తీసుకుంది. పార్కుతో పాటు, ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు స్థానికులు.
Also Read : Minister Azharuddin Growth : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్

















