Hydraa : హైదరాబాద్ : హైదరాబాద్ నగర వాసుల్లో చైతన్యం వచ్చింది. గతంలో భయపడిన వారంతా ఇప్పుడు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తమ ప్రాంతంలో భూ కబ్జాలకు , ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా నిర్వహిస్తున్న ప్రజా వాణికి 61 ఫిర్యాదులు అందాయి. ప్రజావసరాలకు వాటిని కాపాడాలని కోరారు ఫిర్యాదుదారులు. ఒకరిద్దరి ధన దాహానికి ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నాయని పలువురు వాపోయారు. ఆర్థిక, అంగ బలంతో చేస్తున్న కబ్జాలను నియంత్రించాలని, ఆయా ప్రాంతాల్లో ఉన్న వేలాది మందికి ప్రయోజనం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా హైడ్రా (Hydraa) చర్యలను అభినందించారు.
Hydraa Gets Huge Complaints
అదే భరోసాతో తాము కూడా వచ్చామని పలువురు పేర్కొన్నారు స్థానికులు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని మల్లాపూర్ విలేజ్‌లోని ఏఎంఆర్ టౌన్‌షిప్‌లో 2 పార్కులతో పాటు, రెండు రహదారులను ఆక్రమించేశారంటూ టౌన్‌షిప్ నివాసితుల ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అలాగే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం సాయినగర్ కాలనీలో నాలా పక్కన ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని శ్రీ సాయినగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. అమీర్‌పేట మండలం సంజీవరెడ్డి నగర్ సర్వే నంబరు 102/1, 102/3 లో 1550 గజాల స్థలం పార్కుకోసం కేటాయించగా దానిని కబ్జా చేస్తున్నారంటూ అక్కడి నివాసితులు వాపోయారు. ఇలా నగరం నలుమూలల నుంచి హైడ్రా ప్రజావాణికి మొత్తం 61 ఫిర్యాదులందాయి. వీటిని హైడ్రా అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్ పరిశీలించారు. వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
Also Read : VRO-GPO Committee Strong Demand : వీఆర్ఓ, జీపీఓలకు సకాలంలో జీతాలు చెల్లించండి


















