Hydraa : హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టింది. కేవలం ఆదివారం రోజే కూల్చివేతలకు మరోసారి శ్రీకారం చుట్టింది. ఎట్టి పరిస్థితుల్లో వారంతంలో కూల్చ వద్దని స్పష్టం చేసినా పట్టించు కోలేదంటూ బాధితులు వాపోతున్నారు. ఇవాళ రూ. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసే పనిలో నిమగ్నమైంది హైడ్రా (Hydraa). కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి కల్పించింది. కబ్జాలు నిర్ధారించుకుని ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టింది. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగింపు కొనసాగించింది.
Hydraa Operation Updates
సర్వే నంబర్ 307 లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో ఆక్రమణలు తొలగించే పనిని చేపట్టామని స్పష్టం చేసింది హైడ్రా. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు ఈ భూమిని కేటాయించారని తెలిపింది. అయితే ఈ కేటాయించిన భూమిలో బడా బాబులు ఆక్రమణలకు తెర తీశారని, ఇందుకు సంబంధించి తమకు ఫిర్యాదులు అందాయని స్పష్టం చేసింది. ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచచ్చింది. పేదవారిని ముందు పెట్టి బడా బాబులు వేయించిన షెడ్డుల తొలగించామని పేర్కొంది.
ఇదిలా ఉండగా గాజులరామారం కూల్చి వేతలపై స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. గాజుల రామారంలోని 317 ఎకరాల ప్రభుత్వ భూముల్లోని కబ్జాలను తొలగిస్తున్నాం అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు ఆక్రమించిన వందల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పేదల ఇళ్లు కూల్చవద్దని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు.
Also Read : Sunil Gavaskar Interesting Comments on Sanju : సంజూ శాంసన్ టైమింగ్ అద్భుతం : సన్నీ

















