Hydraa : హైదరాబాద్ : శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సంధ్యా శ్రీధరరావు నిర్మించిన పలు అక్రమ కట్టడాలను హైడ్రా (Hydraa) కూల్చివేసింది. ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ (ఎఫ్సీఐ) లే ఔట్లో రహదారులు, పార్కులను పట్టించు కోకుండా.. చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. 40 ఫీట్ల రహదారిపై అడ్డంగా ఐరన్ ఫ్రేమ్ తో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని తొలగించి రహదారిని క్లీయర్ చేసింది. అలాగే నిర్మించిన మ్యాంగో ఫుడ్ కోర్టును కూడా తొలగించింది. మరో చోట 40 ఫీట్ రహదారిపై నిర్మించిన యూనో ఫుడ్ కోర్టును కూడా తొలగించి మార్గం సుగమం చేసింది. పెట్రోల్ బంక్ ను కూడా పాక్షికంగా తొలగించింది. రెండు చోట్ల 25 ఫీట్ల రహదారులపై ఏర్పాటు చేసిన ఫుడ్ కంటైనర్లతో పాటు చైనా ఫుడ్ కోర్టులను తొలగించి మార్గాలను క్లియర్ చేసింది.
Hydraa Shocking Decision
ఆసుపత్రి భవనం సెల్లార్ ర్యాంపులను హైడ్రా తొలగించింది. ఇలా మొత్తమ్మీద 7 చోట్ల రహదారులను ఆక్రమించి నిర్మించిన పలు కట్టడాలను తొలగించింది. రహదారుల హద్దులను నిర్ధారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు లే ఔట్లోని రహదారులను హైడ్రా పునరుద్ధరించడంతో అక్కడి ప్లాట్ యజమానులు హర్షం వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ (ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ) లే ఔట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలను హైకోర్టు మంగళవారం తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లేఔట్లో 162 వరకూ ప్లాట్లుండగా.. అందులోని మెజార్టీ ప్లాట్లు నావనే ఉద్దేశంతో రహదారులు, పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. ఒకసారి లే ఔట్ వేస్తే.. అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Also Read : YS Sharmila Fired on CM Chandrababu : సీఎం చంద్రబాబు కామెంట్స్ వైఎస్ షర్మిల సీరియస్


















