హైదరాబాద్ : ఓ వైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను వెంటనే తప్పించాలని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పేదల పాలిట శాపంగా మారిందని, ఇంకోవైపు బడా బాబులకు మేలు చేకూర్చేలా కమిషనర్ హైడ్రా పేరుతో చర్యలు తీసుకుంటారని సీరియస్ అయ్యారు జడ్జి అనిల్ కుమార్ . దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా అని చెప్పారు.
ఎవరిని అధికారిగా నియమించాలనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆ పవర్స్ హైకోర్టుకు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులపై గౌరవం, నమ్మకం ఉందన్నారు. తప్పుడు కేసులను ఎదుర్కుంటాం అని స్పష్ట చేశారు. హైడ్రా ఎన్నో చెరువులను, నాలాలను కాపాడిందని ఈ విషయంలో ఎలాంటి తప్పు పట్టాల్సిన పని లేదన్నారు. హైడ్రా తన పనితీరుతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుందని, దీనికి ప్రధాన కారణం కమిషనర్ ఏవీ రంగనాథ్ పనితీరు వల్లనేనని పేర్కొన్నారు సీఎం. హైడ్రాను మరింత బలోపేతం చేస్తాం అని ప్రకటించారు.
కొందరు కావాలని సోషల్ మీడియాలో డబ్బులిచ్చి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి హైడ్రా కార్యాచరణతో పాటు చేస్తున్న పనులపై స్పష్టత ఉందన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలను ఇంకా తాను పరిశీలించ లేదని అన్నారు. ప్రభుత్వ పరంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్ష చేస్తామని పేర్కొన్నారు.

















