Hydraa : హైదరాబాద్ :హైడ్రా దూకుడు పెంచింది. చెరువులు, కుంటల పునరుద్దరపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆక్రమణలు, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. తాజాగా మురుగు నీటిని, దుర్గంధాన్ని వదిలించుకుని సహజ సరస్సుగా రూపు దిద్దుకుంటున్న తమ్మిడికుంట చెరువును పరిశీలించారు. ముళ్ల పొదలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మీటర్ల మేర పేరుకు పోయిన పూడికను తొలగించి చెరువుకు సహజత్వాన్ని హైడ్రా (Hydraa) అందించింది. చెరువులో ఆక్రమణలతో పాటు పూడికను తొలగించి విస్తీర్ణం పెంచడంతో ఇప్పుడా పరిసరాలు ఎంతో విశాలంగా మారాయి. శిల్పారామం వైపు ప్రధాన ప్రవేశ మార్గంతో నయన మనోహరంగా మారుతోంది. అభివృద్ది పనులను పరిశీలించి ఆరా తీశారు. చెరువు చుట్టూ పటిష్టమైన బండ్ నిర్మాణంతో పాటు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్ల నిర్మాణ పనులు జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. ఐటీ కారిడార్ ఉన్న ఈ చెరువును ఓ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
Hydraa Commission Update
శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా ఇన్లెట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. 14 ఎకరాల చెరువును 29 ఎకరాలకు విస్తరించడం జరిగిందని, అదే విస్తీర్ణంలో నీరు నిలిచేలా చెరువు అభివృద్ధి చేయాలని సూచించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు నడియాడే ప్రాంతం ఇది. అత్యధిక జనసాంధ్రత ఉన్న ప్రాంతం కూడా ఇదే.. ఇలాంటి చోట ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. తమ్మిడికుంటలో స్వచ్ఛమైన నీరు ఎంత ముఖ్యమో.. ఆ పరిసరాలు కూడా అంతే పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు చుట్టూ దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉన్న బండ్‌పై ప్రాణ (ఆక్సిజన్) వాయువు అందించడంతో పాటు.. చల్లటి నీడనిచ్చే చెట్లు పెంచాలన్నారు. చెరువు ప్రధాన ప్రవేశ మార్గంలో పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు. పిల్లలకు ఆటవిడిపుగా క్రీడా స్థలాలను తీర్చిదిద్దాలన్నారు. వృద్ధులు కూర్చునేందుకు వీలుగా చట్టూ సిమెంట్, రాతి కుర్చీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Also Read : AP Cabinet Approved : క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం బిలియన్ డాలర్ల లక్ష్యం

















