Hydraa : హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను, పార్కులను కాపాడే ప్రయత్నంలో ఫోకస్ పెట్టింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ మరింత దృష్టి సారిస్తూ ఆక్రమణదారులకు ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని కూకట్‌పల్లికి చెందిన నల్ల చెరువును మణిహారంగా హైడ్రా రూపుదిద్దింది. ఈ నెలాఖరుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తోంది. చెరువును పూర్తి స్థాయిలో తవ్వి వర్షపు నీటితో నింపింది హైడ్రా. ఆ పరిసరాలను అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి పనులను హైడ్రా (Hydraa) కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులను.
Hydraa Commissioner Key Update
అంతే కాకుండా చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు ఒకటికి రెండు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పెద్దవాళ్లు సేద దీరేలా గజబో (విశ్రాంతి మందిరం)లు నిర్మించాలని, చెరువుకు నలువైపులా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నాటాలని పేర్కొన్నారు. ఇక్కడికి వస్తే ఆరోగ్యం అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఒకప్పుడు ఎలా ఉండేది, నేడు ఎలా అభివృద్ధి చెందింది అనేది చూడాలనుకుంటే కూకట్‌పల్లి నల్ల చెరువును సందర్శించాలని హైడ్రా నగర ప్రజలను ఆహ్వానిస్తోంది. ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండి మురికి కూపంగా మారిన చెరువు సరికొత్త జలాశయంగా కనిపిస్తోంది.
Also Read : Rangareddy A Major Road Accident Shocking : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

















