Hydraa : హైదరాబాద్ : హైడ్రా అంటే అభయమని, సంస్థ పేరుతో అపోహలు సృష్టించడం, ప్రజలను భయాందోళలనకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ కుంట (సుద్దకుంట చెరువు) చెంత ద్వారకానగర్ నివాసితుల ఫిర్యాదుల మేరకు కమిషనర్ క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. సుమారు గంటపాటు అక్కడ పర్యటించి స్థానికులతో మాట్లాడి ప్రతి అంశాన్ని నివృత్తి చేశారు. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా చెరువుల పేరిట ఆందోళనలు కలిగించే వివిధ శాఖల అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. చెరువుల కబ్జాదారులపై చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. హైడ్రా (Hydraa) పేరు చెప్పి వసూళ్లు చేస్తున్న ఘటనలు కూడా తమ దృష్టికి వస్తున్నాయని, అలాంటి విషయాలను సహేంచేది లేదని హెచ్చరించారు.
Hydraa Commission Updates
సుద్దకుంట చెరువు చెంత తాము 30 ఏళ్ల క్రితం నుంచి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని ఇప్పుడు తమ నివాసాలు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తున్నాయని హైడ్రా పేరు చెప్పి బెదిరిస్తున్నారంటూ వాపోయారు. HMDA, మున్సిపల్ స్థానిక అధికారులు ఎఫ్‌టీఎల్ మార్కింగ్ చేసి ఇనుప కడ్డీలు పాతి.. ఇళ్లపై నంబర్లు వేసి ఈ ఏడాది జులైలో మార్కింగ్ చేశారు. ఇదేమని అడిగితే హెచ్ ఎండీఏ, మున్సిపల్ అధికారులు మరింత భయాందోళనలు కలిగిస్తున్నారని తెలిపారు. ఈ చెరువుకు 2014లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి సర్వే చేసి ఎఫ్‌టీఎల్ హద్దు రాళ్లు పాతారు. వాటిని పట్టించు కోకుండా అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎఫ్‌టీఎల్ హద్దులు మార్చి వేశారని ఆరోపించారు. నివాసాలలో చెరువు ఎఫ్‌టీఎల్ ఉన్నట్లుగా చూపించి భయపెడుతుండడంతో. నెలల తరబడిగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్నారు. 1990లో ఈ చెరువుకు – నివాసాలకు మధ్య రోడ్డు వేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయినప్పటికీ రోడ్డును కూడా ఎఫ్‌టీఎల్ లో చూపించి ప్రజలలో భయం కలిగించారని అధికారులపై ఫిర్యాదు చేశారు.
Also Read : Popular Actress Priyanka Chopra : ఎస్ఎస్ రాజమౌళి మూవీలో నటించడం అదృష్టం


















