Vijayawada : ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీపి కబురు చెప్పింది. బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు హైదరాబాద్ విజయవాడ (Vijayawada) జాతీయ రహదారి విస్తరణకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రహదారిపై ప్రతి రోజూ వేలాది వాహనాలు రాక పోకలు సాగిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ మధ్య వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ఏపీకి చెందిన పలువురు వివిధ రంగాలలో ఇక్కడ పని చేస్తున్నాయి. దీంతో రాక పోకలకు రద్దీ ఏర్పడుతోంది. దీంతో ఇదే సమయంలో రహదారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని నివారించడంలో భాగంగా కేంద్రం ఇరు ప్రాంతాల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు గాను హైవే విస్తరణ పనులకు పచ్చ జెండా ఊపింది.
Hyderabad-Vijayawada Highway Approved
ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి 65గా ఉంది. ప్రస్తుతం నాలుగు లేన్ల రహదారి విస్తరించి ఉంది. ఇది రోజూ వారీ వాహనాలకు సరి పోవడం లేదు. నిత్యం రద్దీగా ఉంటోంది ఈ జర్నీ. దీనిని గమనించింది కేంద్రం. ఈ మేరకు నాలుగు లేన్లుగా ఉన్న హైవేను ఆరు లేన్లుగా అప్ గ్రేడ్ చేసేందుకు చివరకు ఓకే చెప్పింది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జాతీయ రోడ్లు, భద్రతా వ్యవహరాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలిశారు. రహదారిని విస్తరించే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు. చివరకు సీఎం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇవాళ అందుకు కేంద్రం ఓకే చెప్పడం విశేషం.
Also Read : Minister Kandula Durgesh Important Visit : పర్యాటక హబ్ గా ఆంధ్రప్రదేశ్ : కందుల దుర్గేష్


















