Rains : హైదరాబాద్ : బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు (Rains) ముంచెత్తాయి. రాజధాని హైదరాబాద్ అతలాకుతలమైంది. మూసీ నది పొంగి పొర్లుతోంది. మూసారాంబాగ్, చాదర్ ఘట్ నీట మునిగింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. ప్రతి రోజూ వేలాది మందిని తమ ప్రాంతాలకు సురక్షితంగా చేరవేస్తున్న బస్సులను దారి మళ్లించారు. నగరం వెలుపల నుంచే నడుపుతున్నారు. మరో వైపు ప్రయాణీకులకు స్వర్గధామంగా ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) పూర్తిగా నీట మునిగింది. బస్సులు చిక్కుకు పోయాయి. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తరలించారు.
Huge Rains in Telangana, Hyderabad
దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్. బస్సు సర్వీసులను ఇతర ప్రాంతాలకు మార్చాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ప్రయాణికులు బస్ స్టేషన్ కు రావద్దని కోరారు ముందు జాగ్రత్తగా. ప్రత్యామ్నాయ ప్రదేశాల నుండి నడిచే సర్వీసులు మూసీ నది ప్రవాహం కారణంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మునిగి పోయింది . మూసీ నదికి భారీగా వరదలు రావడంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) ప్రాంగణంలోకి నీరు చేరింది, దీంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) స్టేషన్ నుండి బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపి వేసింది. ఎంజీబీఎస్ నుండి బయలు దేరాల్సిన అన్ని సర్వీసులు ఇప్పుడు హైదరాబాద్ అంతటా ప్రత్యామ్నాయ పాయింట్ల నుండి నడుస్తున్నాయి.
Also Read : IPS Sajjanar Growth : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్
















