ముంబై : ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో పోషించిన చిత్రం హోమ్ బౌండ్ ఇప్పటికే పలు అవార్డులను స్వంతం చేసుకుంది. సినీ విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా యావత్ సినీ ప్రపంచం కోరుకునే అరుదైన ఆస్కార్ 2026 అవార్డుల రేసుకు సంబంధించి ఎంపిక చేసిన షార్ట్ లిస్టు లో చోటు దక్కించుకుంది హోమ్ బౌండ్ మూవీ. ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో భారత్ తరఫున ఆస్కార్ పోటీలకు వెళ్లినట్లు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా బుధవారం వెల్లడించింది. నీరజ్ ఘయ్వాన్ హోమ్ బౌండ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. సెలక్షన్ కమిటీ చైర్ పర్సన్ ఎన్ . చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమకు , దేశానికి గర్వ కారణంగా ఉందన్నాడు. ప్రేక్షకులు మంచి చిత్రాన్ని ఎక్కడైనా , ఏ ప్రాంతంలోనైనా ఆదరిస్తారని ఈ సినిమాతో నిరూపితమైందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా హోమ్ బౌండ్ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ సెర్టైన్ రిగార్డ్ కేటగిరీకి ముందుగా ఎంపిక చేయబడింది. ఈ చిత్రాన్ని 14 మంది సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఇది చాలా కష్టమైన ఎంపిక. ఇవి జీవితాలను తాకిన చిత్రం అన్నారు చంద్ర. కరణ్ జోహార్, అదర్ పూనావాలా హోమ్ బౌండ్ మూవీని నిర్మించారు. జర్నలిస్ట్ బషరత్ పీర్ న్యూయార్క్ టైమ్స్ లో రాసిన కథనాన్ని స్పూర్తిగా తీసుకుని దర్శకుడు హోమ్ బౌండ్ ను తీశాడు . ప్రత్యేకించి ముస్లిం, దళితుడి మధ్య బంధాన్ని స్నేహం, గౌరవం గురించి ఇందులో ప్రధానంగా చిత్రీకరించారు. హోమ్ బౌండ్ కేన్స్ ఫెస్టివల్ లో చూసిన వారంతా లేచి చప్పట్లతో స్వాగతించారు. ఆనాటి నుంచి నేటి దాకా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటూనే ఉంది.
