Home Minister Anitha : విజయవాడ : ఏపీలో పేరు పొందిన పుణ్యక్షేత్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం. దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు పథకం అమలు చేస్తుండడంతో భారీ ఎత్తున మహిళా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తోంది సర్కార్. ఈ మేరకు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని, ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. కొండపైన ఏర్పాట్లను పరిశీలించారు హోం మంత్రి అనిత.
AP Home Minister Anitha Comments
అనంతరం మోడల్ గెస్డ్ హౌస్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష లో పాల్గొన్నారు ఎంపి కేశినేని శివనాధ్ చిన్ని, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, సిపి రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్,క్యూ లైన్లు, Vip పాస్ లపై అధికారులతో చర్చించారు హోం మంత్రి అనిత. దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని చెప్పారు. 15 లక్షల మంది భక్తులు ఈసారి దసరా ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఒక్క ఇన్సిడెంట్ లేకుండా దసరా ఉత్సవాలని దిగ్విజయంగా జరిపామన్నారు. అమ్మ వారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామన్నారు.
Also Read : Minister Narayana Interesting Update : ఏపీలో 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం
