Toranto Film Festival : విమర్శకుల ప్రశంసలు పొందింది హోమ్ బౌండ్. ఇందులో కీలక పాత్ర పోషించింది జాహ్నవి కపూర్. ఇప్పటికే ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హోమ్ బౌండ్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Toranto Film Festival) కు ఎంపికైంది. ఈ చిత్రాన్ని గాలా ప్రజెంటేషన్ కేటగిరిలో ఎంపిక చేశారు. దీనిని హృదయానికి హత్తుకునేలా తీశాడు దర్శకుడు. ప్రధానంగా మానవుల మధ్య జరిగే అంతర్లీనమైన సంబంధాలను తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పక తప్పదు.
Toranto Film Festival – Home Bound Movie Selected
హౌమ్ బౌండ్ మూవీలో ఇద్దరు యువకులు పోలీస్ జాబ్ సాధించాలని కలలు కంటారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పెరిగిన దూరం, మత, సామాజిక అంశాలు, అసమానతలు, వ్యక్తిగత ప్రయత్నాలను , చివరకు ఏం సాధించారనే దానిపై దర్శకుడు ఉత్కంఠ భరితంగా, భావోద్వేగంతో తీశాడు. అయితే విచిత్రం ఏమిటంటే హోమ్ బౌండ్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కానీ రిలీజ్ కాకుండానే అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దీంతో దర్శకుడు, చిత్ర బృందం సంతోషానికి లోనవుతోంది.
ఇదిలా ఉండగా కేన్స్ వేదికగా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో హోమ్ బౌండ్ ను ప్రదర్శించారు. పెద్ద ఎత్తున స్పందన లభించింది. భారీగా ప్రశంసలు లభించాయి. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ లు తమ భావోద్వేగాలను అణుచుకోలేక పోయారు. ఇంతలా ఆకట్టుకుంటుందని, ఆలోచింప చేసేలా చేస్తుందని అనుకోలేదన్నాడు దర్శకుడు.
Also Read : Monsoon – Eating Ice Cream Danger : వర్షాకాలంలో మీకు ఐస్ క్రీమ్ తినే అలవాటుందా అయితే జాగ్రత్త



















