హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు హిందువులు, ముస్లింలు రెండు కళ్లు అని పేర్కొన్నారు. బెంగాల్ లో మమతా బెనర్జీ వదిలేశారెమో ఇక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టరని నేను చెప్పానని అన్నారు. మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.హిందూ ముస్లింలు రెండు కళ్లు అని మాటల్లో కాదు చేతల్లో చూపించారు సోనియా గాంధీ అని ప్రశంసించారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని అమిత్ షా అన్నారు .ఇ క్కడ కాదు ముందు గుజరాత్ లో తొలగించి చూపించాలని ఆనాడు మేం సవాల్ విసిరిమన్నారు సీఎం.
ప్రజా ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్ పటిష్టంగా అమలు చేసిందని చెప్పారు. మైనారిటీ యువత గ్రూప్ 1, గ్రూప్ 2 లలో ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పించాం అని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మైనారిటీ నుంచి సభ్యుడిగా నియమించడం జరిగిందన్నారు. కొందరు గ్రూప్స్ ఉద్యోగాలపై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూసినా.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం అన్నారు సీఎం. ఎవరూ అడగక పోయినా మైనారిటీలకు దక్కాల్సిన స్థానాన్ని వారికి కల్పించినట్లు తెలిపారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చాం, నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కల్పించాం. రూ. 3 కోట్లు నగదు బహుమతి అందించాం . మహమ్మద్ సిరాజుద్దీన్ కోసం నిబంధనలు సవరించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామన్నారు.
మైనారిటీ యువత చదువుతో పాటు నైపుణ్యం సంపాదించాలన్నారు. జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి .విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం
నైపుణ్యం నేర్చుకోండి.. అది మీ జీవితాలను మారుస్తుందన్నారు సీఎం. మీ అందరి సహకారంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని చెప్పారు. సర్ పేరుతో ఓట్లు తొలగించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ లో గెలిచామని ఇక తెలంగాణనే టార్గెట్ అని కొందరు మాట్లాడుతున్నారు . ఇక్కడ బీజేపీ ఆటలు చెల్లవన్నారు రేవంత్ రెడ్డి.
