Hinduja Group : లండన్ : యుకె పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆయా పారిశ్రామికవేత్తలు విశాఖలో ఈనెలలో నిర్వహించే సీఐఐ సదస్సుకు రావాలంటూ ఆహ్వానం పలికారు సీఎం. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు హిందూజా గ్రూప్ (Hinduja Group), లాంటి దిగ్గజ సంస్థలు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు తమ సర్కార్ ఒప్పందం చేసుకుందన్నారు. తన పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించు కోవడం మరింత పని చేసేందుకు దోహదం చేసిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. దీని ద్వారా మన రాష్ట్ర పారిశ్రామిక, స్వచ్ఛ ఇంధన వృద్ధిని వేగవంతం చేయడానికి రూ. 20,000 కోట్ల సంచిత పెట్టుబడిని సూచిస్తుందన్నారు. హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ పి. హిందూజా; హిందూజా గ్రూప్ యూరప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా; హిందూజా ఇన్వెస్ట్‌మెంట్స్ , ప్రాజెక్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సిఇఒ వివేక్ నందా సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం జరిగిందన్నారు సీఎం.
Hinduja Group Huge Investments in AP
ఈ పరివర్తనాత్మక భాగస్వామ్యంపై వారితో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఒప్పందంలో భాగంగా
విశాఖలో విద్యుత్ విస్తరణ కార్యక్రమం చేపట్టనుంది. పరిశ్రమలకు నమ్మకమైన శక్తిని నిర్ధారించడానికి ఇప్పటికే ఉన్న 1,050 మెగావాట్ల హెచ్ఎన్పీసీఎల్ ప్లాంట్‌ను అదనంగా 1,600 మెగావాట్ల (2×800 మెగావాట్లు) విస్తరించనుది. ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి పెద్ద సౌర , పవన ప్రాజెక్టులను రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు సీఎం. కృష్ణా జిల్లాలోని మల్లపల్లిలో ఈవీ తయారీ తో పాటు విద్యుత్ బస్సులు, వాహనాల తయారీకి ప్లాంటు ఏర్పాటు చేయాలని కోరారు. హరిత రవాణా పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అంతటా ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను నెలకొల్పాలని కోరారు హిందూజా గ్రూప్ ను.
Also Read : Minister Ponnam Clear Instructions : బస్సు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలి



















