High Tax Collection : 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ఏడాది పన్నుదారులకు చివరి గడువు సెప్టెంబర్ 15, 2025గా నిర్దేశించారు. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ITR-2, ITR-3 ఫారాల ఉచిత వినియోగం కూడా ప్రారంభమైంది. దీంతో ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య దృష్టినీటివలె పెరుగుతోంది.
High Tax Collection – భారత్‌లో గరిష్ఠంగా 39% ఆదాయ పన్ను
ప్రస్తుతం భారతదేశంలో (India) అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు గరిష్ఠంగా 39 శాతం వరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది గ్లోబల్ స్థాయిలో చూస్తే తక్కువగా ఉన్నా, పన్ను చెల్లింపుల్లో ప్రజల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది.
ప్రపంచంలో అత్యధిక పన్ను విధించే దేశాలు
అంతర్జాతీయంగా, కొన్ని దేశాలు తమ ప్రజల ఆదాయంపై అత్యధికంగా పన్నులు విధిస్తున్నాయి. కానీ ఈ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, సంక్షేమ పథకాల రూపంలో మంచి సేవలు అందుబాటులో ఉన్నాయి. పన్ను రేట్ల ఆధారంగా కొన్ని దేశాలు ఇలా ఉన్నాయి:
- ఐవరీ కోస్ట్ (Ivory Coast) – 60% వరకు పన్ను, ప్రపంచంలో అత్యధికం.
- ఫిన్లాండ్ – 56.95%, నార్డిక్ సంక్షేమ వ్యవస్థకు ప్రసిద్ధి.
- జపాన్ – 55.97%, అభివృద్ధి చెందిన ఆరోగ్య, రవాణా సేవలు.
- డెన్మార్క్ – 55.9%, ప్రపంచంలో అత్యంత సంతోషంగా జీవించే దేశాల్లో ఒకటి.
- ఆస్ట్రియా – 55%, పరిశుభ్రత మరియు సామాజిక బద్రతకు గుర్తింపు.
- బెల్జియం – 53.7%, మెరుగైన ప్రజాసేవలు అందుబాటులో.
- స్వీడన్ – సగటున 50%, ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ కల్పన.
- నెదర్లాండ్స్ – 49%, స్థిరమైన పన్ను విధానం.
- ఫ్రాన్స్, జర్మనీ – 45%, అభివృద్ధి చెందిన సంక్షేమ మోడల్స్‌తో కూడిన దేశాలు.
భారత దిశగా మారుతున్న పన్ను విధానం
పన్ను పరిధిలోకి మరిన్ని వ్యక్తులను తీసుకురావడమే కాకుండా, డిజిటలైజేషన్ ద్వారా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ దిశగా ITR ఫారాల సులభీకరణ, వెబ్‌సైట్‌లో వినియోగదారులకు అనుకూలత వంటి మార్పులు నిర్వహించబడుతున్నాయి.
Also Read : RBI Shocking : 2 వేల నోట్లపై కీలక అప్డేట్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్


















