Rishab Shetty : కర్ణాటక : నటనా పరంగా ప్రత్యేకతను కలిగిన నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty). తాను నటించిన కాంతారా , కాంతారా 2 సినిమాలు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చాయి. లక్షలాది మంది అభిమానులను తెచ్చి పెట్టేలా చేసింది. తాజాగా తనకు అరుదైన గౌరవం లభించింది. కర్ణాటక రాష్ట్ర చలన చిత్ర అవార్డు పొందారు. ఆయన కర్ణాటక ప్రాంతపు చరిత్ర, సంస్కృతి, ఔన్నత్యాన్ని, అక్కడి పద్దతులను, అలవాట్లను ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రపంచ పటంలో భారతీయ కథను హృద్యంగా , ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పడంలో సక్సెస్ అయ్యారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం సదరు విలక్షణ నటుడు కాంతారా చాప్టర్ 1 సక్సెస్ సాధించిన యాత్రలో భాగం పంచుకున్నారు. తన సతీమణితో కలిసి వివిధ ప్రాంతాలలో సక్సెస్ మీట్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే జాతీయ పురస్కారం అందుకున్నారు రిషబ్ శెట్టి.
Rishab Shetty Gets A Great Award
ఇదిలా ఉండగా తను దర్శకత్వం వహించిన సర్కారీ హాయ్. ప్రా. షాలే, కాసరగోడు, కొడుగే, రామన్న రాయ్ పేరు పొందాయి. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా కన్నడ సినిమా పరిశ్రమ తనను గుర్తించింది. జాతీయ స్థాయిలో కన్నడ సినిమాకు మరింత పేరు తీసుకు రావడంలో రిషబ్ శెట్టి పాత్ర కూడా ఉంది. ఇక గతంలో శివ రాజ్ కుమార్ తో పాటు యశ్ కూడా కర్ణాటక నాట టాప్ లో కొనసాగుతున్నారు. ఇక రిషబ్ శెట్టి పూర్తిగా సంస్కృతిని ప్రధానంగా తీసుకుని తెరకెక్కించే ప్రయత్నంలో మునిగి పోయారు. సామాజిక ఔచిత్యాన్ని శక్తివంతమైన వినోదంతో మిళితం చేయడంలో దృష్టి సారించాడు.
Also Read : Beauty Rashmika Mandanna : ఆ గోల్డ్ రింగ్ వెరీ స్పెషల్ : రష్మిక మందన్నా

















