Ram Charan : సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ వంగా టైం చాలా బాగున్నట్టుంది. “అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ , యానిమల్” మూవీల హిట్ల తర్వాత.. వరుసబెట్టి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ‘యానిమల్’ హిట్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. పైగా చిన్నాచితకవి కాకుండా ఏకంగా బడాస్టార్లే ఆయనకు ఛాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లైన్ లో ‘యానిమల్ పార్క్’ ఆ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. తాజాగా మరో స్టార్ హీరోతో సినిమాకు రెడీ అయ్యాడన్న న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
Ram Charan – Sundeep Reddy Vanga Combination
గత కొన్ని రోజులుగా సందీప్ వంగా (Sundeep Reddy Vanga) పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. రీసెంట్ గా ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపిక పడుకోణెను తప్పించడంతో ఆయన పేరు మరింత మార్మోగిపోతోంది. ప్రెజెంట్ చేతిలో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికి….. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో జోడీకట్టబోతున్నాడన్న న్యూస్ ఇండస్ట్రీని విశేషంగా మారింది. ఇప్పటి దాకా టాలీవుడ్ లో ఉన్న టాక్ ప్రకారం.. సందీప్ వంగ తన నెక్ట్స్ సినిమాని ప్రభాస్ తో చేయాల్సి ఉంది. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇద్దరిని యూవీ క్రియేషన్స్ కలపబోతున్నారన్న న్యూస్ వైరల్ గా మారింది. వంగాకు ‘అర్జున్ రెడ్డి’ సినిమా టైంలోనే అడ్వాన్స్ కూడా ముట్టిందని… దీంతో ఈ బ్యానర్ లో వంగా ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇప్పటికే రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీతో పాటు సుకుమార్ సినిమాలతో లాక్ అయ్యాడు. రీసెంట్ గా త్రివిక్రమ్ తో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు మూడు నాలుగేళ్ల వరకు డేట్స్ ఖాళీ లేని సమయంలో వంగాతో మూవీ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు వంగా… ప్రభాస్, రణబీర్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా రణబీర్ కపూర్ “రామాయణం, లవ్ అండ్ వార్, ధూమ్ 4” లకు కమిట్ అయ్యాడు. అల్లు అర్జున్ అట్లీ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా… అదే టైంలో మలయాళ డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడట. ఏ లెక్కన చూసుకున్నా ‘స్పిరిట్’ తర్వాత చరణ్ తో మూవీ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. సుకుమార్ మూవీ ఆలస్యం అయితే… ఆ గ్యాప్ లో రామ్ చరణ్ తో వంగా ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా కనిపిస్తుందన్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. పైగా చరణ్ వంగా కాంబోను నెవర్ బిఫోర్ అనేలా ప్లాన్ చేస్తోందట యూవీ సంస్థ. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read : Hero Dhanush-Kubera : కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 15 కు మార్చిన నిర్మాత



















