Bhagyashree : రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఓ సినిమా ఫెయిలయినా ఆమె గ్లామర్‌కు, స్క్రీన్ ప్రెజెన్స్‌కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆమెపై సినీ పరిశ్రమలో ఆసక్తి పెరిగింది, తెలుగు యువతలో క్రష్‌గా మారిపోయింది.
Hero Prabhas-Bhagyashree Borse Movie Updates
ప్రస్తుతం భాగ్యశ్రీ (Bhagyashree Borse) విజయ్ దేవరకొండ సరసన నటించిన కింగ్‌డమ్ మూవీ షూటింగ్ పూర్తి అయింది. ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. ప్యాషన్, యాక్షన్ మిక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా భాగ్యశ్రీకి మంచి గుర్తింపు రానుందని సినీ వర్గాల్లో ఆశిస్తున్నారు.
అంతేకాదు, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్తో కలిసి కాంత అనే పీరియడ్ డ్రామా చిత్రంలోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జోన్ వర్గీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాత్రకు డెఫ్త్ ఉండే ఈ చిత్రంలో భాగ్యశ్రీ నటన మరోసారి చర్చకు తెరతీసేలా ఉందని ఫిలింనగర్ టాక్.
అంతేకాదు, రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఆంధ్ర కింగ్ అనే సినిమాలోనూ కథానాయికగా భాగ్యశ్రీ ఎంపికైంది. ఈ చిత్రానికి “బయోపిక్ ఆఫ్ ఫ్యాన్” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ ఉంది. ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి దర్శకుడు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదంతా జరుగుతుండగానే, తాజాగా ప్రభాస్ సరసన భాగ్యశ్రీ ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఇప్పటికి అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇది నిజమైతే ఆమె టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విధంగా వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు రావడంతో, భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అందాల తార ప్రయాణం ఎలా సాగనుందో వేచి చూడాల్సిందే!
Also Read : Hero Prabhas-The Raja Saab : ది రాజా సాబ్ సినిమా సీక్వెల్ పై డైరెక్టర్ కీలక అప్డేట్



















