Hero Pawan – Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ జులై 24న పక్కా..

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వీఎఫ్‌ఎక్స్‌ తదితర కారణాలతో పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే..

Hello Telugu - Hero Pawan - Hari Hara Veera Mallu

Hello Telugu - Hero Pawan - Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu : పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కొత్త విడుదల తేదీ ఖరారైంది. తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ (Hari Hara Veera Mallu) పేరుతో జులై 24న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో డేట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వీఎఫ్‌ఎక్స్‌ తదితర కారణాలతో పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే! ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉందడగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు కొత్త డేట్‌ను ప్రకటించారు.

Hari Hara Veera Mallu Movie Release Updates

పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటం తదితర కారణాలతో ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడటం, ఆలస్యం కావడం జరిగింది. తొలుత ఈ చిత్రాన్ని కొంతభాగం క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, తదుపరి నిర్మాత ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో పవన్‌ చారిత్రక యోధుడిగా నటిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేయనటువంటి, ప్రేక్షకులు చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌. బాబీ దేవోల్‌, అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా నిర్మాత ఆర్ధికంగా నలుగుతున్న క్రమంలో పవన్‌ తాను అడ్వాన్స్‌గా తీసుకున్న రెమ్యునరేషన్‌ మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు.

Also Read : Hero Chiranjeevi- Ravipudi : మెగాస్టార్, అనిల్ రావిపూడి సినిమాలో కొత్త ట్విస్ట్

Exit mobile version