తిరుమల : తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకల సందర్భంగా భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ , విభాగాల మధ్య సమన్వయ చర్యలపై జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీ , ఎస్‌ఓ మురళీకృష్ణ , గారితో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్, ఆక్టోపస్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రథసప్తమి నాడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో జరిగే అన్ని వాహన సేవలు ఒక్కరోజే అత్యంత వైభవంగా నిర్వహించ బడతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా చక్రస్నానం సందర్భంగా కోనేరు ప్రాంతంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భక్తుల రాకపోకలను సజావుగా నిర్వహించేందుకు ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. ఇదిలా ఉండగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆద్వర్యంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఘణంగా నిర్వహించారు. గతంలో కంటే ఈసారి అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.



















