IMD : అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (IMD) . ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటుఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర , దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ, యానాంలలో వారంలో విడిగా భారీ వర్షాలు, మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 21 , 22 తేదీల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ , యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ , రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
IMD Warning for Rains
విడిగా ఉన్న ప్రదేశాలలో గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. రాయలసీమలో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 23, 24 తేదీలలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని, దక్షిణ కోస్తా, యానాం మీదుగా విడిగా ఉన్న ప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమ అంతటా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. స 25న, ఉత్తర కోస్తా, యానాం , తదితర ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమతో సహా అన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇక 26 , 27 తేదీలలో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా , రాయలసీమ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Also Read : TGPSC Group-2 Interesting Updates : 23 నుండి గ్రూప్-2 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్

















