Heavy Rains : అమరావతి – పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదన్నారు.
Heavy Rains in AP
రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ప్రభాకర్ జైన్. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిమీ, నర్సన్నపేటలో 62.5 మిమీ, కోటబొమ్మాళిలో 53.2 మిమీ, మందసలో 48.7 మిమీ, రాజాపురంలో 46.2మిమీ, వజ్రపుకొత్తూరులో 40.7 మిమీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ఇదిలా ఉండగా తెలంగాణలో సైతం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పూర్తిగా నిండడంతో కిందకు గేట్లను వదులుతున్నారు. ఏపీలోని సుంకేశుల, గోదావరి, నాగార్జునసాగర్ ,శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులన్నీ నిండి పోయాయి.
Also Read : TTD Chairman Br Naidu Alarming : శస్త్ర చికిత్సల సమయం తగ్గించేందుకు చర్యలు


















