AP : అమరావతి : ఏపీ రాష్ట్ర సర్కార్ కు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఏపీ (AP) రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాను కేంద్రీకృతమై ఉందని తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ . ప్రస్తుతానికి ఇది కారైకాల్ కి 220 కి,మీ., పుదుచ్చేరికి 330 కి.మీ., చెన్నైకి 430 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. గడిచిన 6 గంటల్లో 7 కి.మీ వేగంతో తుపాను కదిలిందని తెలిపారు. రేపు తెల్లవారు జామునకు తీవ్ర వాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు ప్రఖర్ జైన్. దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
AP Rains Update Sensational
ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఎండీ. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను ప్రభావం కారణంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు ఎండీ ప్రఖర్ జైన్. ఇదిలా ఉండగా భారీ వర్షాల కారణంగా మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఎడ తెరిపి వర్షాలు పడనున్న నేపత్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Also Read : DK Shivakumar Shocking Update : సీఎం పదవి ఇవ్వాలా వద్దా అనేది పార్టీ నిర్ణయం















