ఆద‌ర్శ కుటుంబం నుంచి త‌మ‌న్ త‌ప్పుకున్నాడా..?

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశం

hellotelugu-AdarshaKutumbham

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుల‌లో ఒక‌డు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. ఆయ‌న మ‌హేష్ తో తీసిన గుంటూరు కారం ఆశించిన రాణించ‌లేదు. దీంతో త‌దుప‌రి చిత్రం విక్ట‌రీ వెంక‌టేశ్ తో ఆద‌ర్శ కుటుంబం పేరుతో సినిమా తీస్తున్నాడు. ఇప్ప‌టికే గ్లింప్స్ కూడా విడుద‌లైంది. మంచి బ‌జ్ వ‌చ్చింది. అయితే రోజుకో వార్త టాలీవుడ్ లో, సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌స్తుతం ఆద‌ర్శ కుటుంబానికి ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. కానీ ఇటీవ‌ల ఓ వార్త గుప్పుమంది. అదేమిటంటే త‌మిళ చ‌ల‌న సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాష్ కుమార్ ను తీసుకున్నార‌ని, థ‌మ‌న్ ను ద‌ర్శ‌కుడు త‌ప్పించిన‌ట్లు టాక్. వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేయనుంది. అయితే, టీజర్ విడుదలకు ముందే సాంకేతిక బృందంలో ఒక కీలక మార్పు జరిగిందన్న వార్తలు అభిమానులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ మొదట్లో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో ప్రారంభమైంది, కానీ తర్వాత ఆయన స్థానంలో తమన్ వచ్చారు. తమన్ ఈ చిత్రం కోసం చాలా కాలం పాటు పనిచేశారు. కాబట్టి తాజా టీజర్ ప్రకటనలో ఆయన పేరు లేకపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీజర్ అప్‌డేట్‌లో తమన్ పేరు లేకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. సాధారణంగా తన సినిమాల టీజర్లు ,అప్‌డేట్ల ప్రచారంలో చురుకుగా ఉండే ఈ సంగీత దర్శకుడు, ఈసారి మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం.

దీనివల్ల ‘ఆదర్శ కుటుంబం’కు కొత్త సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్ వచ్చారనే బలమైన ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు; టీజర్ విడుదలయ్యాక దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నివేదా పేతురాజ్, యువిన, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య , బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version