Harish Rao : హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao). సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన వారికి ఇస్తామని చెప్పిన రూ.1 కోటి ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి సీఎంకు సుదీర్గ లేఖ రాశారు. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఇప్పటి వరకు బాధితులకు కేవలం రూ.24 లక్షలు ఇచ్చారని తెలిపారు. కానీ కార్మిక శాఖ మంత్రి రూ.50 లక్షలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రచారం చేసుకునేందుకు వచ్చి కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించింది నువ్వే కదా అని సీఎంను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. మరి ఇప్పుడు అడిగితే కంపెనీ యాజమాన్యం చేతిలో ఉంది మా చేతిలో లేదు అని చెప్పడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. మృతుల పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా నష్ట పరిహారంలో లెక్కలు కట్టి ఇవ్వడం ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనం తప్పా మరోటి కాదన్నారు హరీశ్ రావు.
MLA Harish Rao Slams Congress Govt
ప్రమాదంలో కాలి బూడిదైన 8 మంది మృతులకు కనీసం డెత్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోతే, వారి కుటుంబాలకు బీమా డబ్బులు ఎలా వస్తాయో ఆలోచించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల నష్ట పరిహారం కూడా ఇంత వరకు అంద లేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అని ఫైర్ అయ్యారు. అంత పెద్ద ప్రమాదం జరిగితే ఆ కంపెనీ మీద సిట్ విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం కంపెనీ యాజమాన్యానికి కొమ్ము కాయడం దారుణం అన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర లేచి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన నష్ట పరిహారాన్ని బాధితులకు అందించాలని డిమాండ్ చేశారు.
Also Read : MP Eatala Rajender Strong Demand : రైతులు అరిగోస పడుతున్నా పట్టించుకోక పోతే ఎలా..?
















