Harish Rao : మెదక్ జిల్లా – బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి. దీంతో ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్ , నిజామాబాద్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. పలు చోట్ల రహదారులపై నీళ్లు వచ్చాయి. వందలాది గ్రామాలు, కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ సందర్బంగా విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) గురువారం మెదక్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బాధితులతో పరామర్శించారు. వర్షం వస్తున్నా లెక్క చేయకుండా పరిశీలించారు. భారీ ఎత్తున పంటలు నీట మునగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Harish Rao Slams Telangana Govt
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం తన్నీరు హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు ఉంది ముఖ్యమంత్రి తీరు అంటూ సీరియస్ అయ్యారు. భారీ వర్షాలు, వరదతో సగం తెలంగాణ ఆగమాగం అవుతుంటే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని నిన్న మూసీ సుందరీకరణ మీద, ఇవాళ స్పోర్ట్స్ మీద రివ్యూ చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు హరీశ్ రావు. హెలికాప్టర్లు సకాలంలో పంపి ఉంటే బూరుగుపల్లిలో ఇద్దరి ప్రాణాలు పోయేవి కావన్నారు. పెళ్లిళ్లకు హెలికాప్టర్లు వాడుతారు కానీ, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్లు వాడరా అంటూ నిలదీశారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఎందుకు పట్టించు కోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తన్నీరు హరీశ్ రావు.
Also Read : Bhumana Karunakar Reddy Fired on TTD Chairman : బీఆర్ నాయుడుకు చైర్మన్ గా కొనసాగే హక్కు లేదు















