Harish Rao : హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. పాలన చేతకాక ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకున్నాడంటూ మండిపడ్డారు. నెల రోజుల్లో టిమ్స్ సనత్ నగర్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి నేటితో నెల పూర్తయ్యిందన్నారు. ఈరోజు ప్రారంభిస్తున్నట్లా లేదా ఎప్పటి లాగే మరో తేదీ ప్రకటిస్తారా? కోతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి మీ సమాధానం ఏమిటి? అంటూ హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో గప్పాలు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి మీరు చేస్తున్న కృషి శూన్యం అని ఆరోపించారు.
MLA Harish Rao Shocking Comments on CM Revanth Reddy
టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభం పై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప మీరు చేస్తున్నదేం లేదన్నారు హరీశ్ రావు . కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే నటుడు తనికెళ్ళ భరణి చెప్పే కవిత్వం లాగా చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రుల మీద లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వ తీరు చూస్తే నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుందన్నారు.
Also Read : Mallikarjun Kharge Shocking Comments : కర్ణాటక సీఎం మార్పుపై ఖర్గే షాకింగ్ కామెంట్స్















