Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. తను బ్లాక్ మెయిలర్ అంటూ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ మాత్రమే సంతోషంగా ఉన్నారని, మిగతా నాలుగు కోట్ల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. తమ సమస్యలపై ఉద్యోగ సంఘాలు నోరెత్తితే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రెండేళ్లలో ఏం చేశారో జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయమంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నాడని మండిపడ్డారు.
MLA Harish Rao Slams CM Revanth Reddy
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి అనే బ్లాక్మెయిలర్‌కు జూబ్లీహిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచిందన్నారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే ముస్లింలకు మంత్రి పదవి వచ్చిందన్నారు. సినిమా వాళ్లని జైల్లో పెట్టిన రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కోసం సినీ కార్మికులకు వంగి వంగి దండాలు పెడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అరాచకం వల్లనే పీజేఆర్ చనిపోయాడని అన్నారు. బీఆర్ఎస్ హయంలో 60 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మంలో పెట్టామన్నారు. బీఆర్ఎస్ హయంలో హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఎంతో అద్భుతంగా ఉండేవన్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కుప్ప కూలిందన్నారు.
Also Read : AP Govt Interesting Support : శ్రీచరణికి ఏపీ సర్కార్ రూ. 2.5 కోట్ల నజరానా


















