Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) నిప్పులు చెరిగారు. ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై మండిపడ్డారు. ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రధానంగా తనకు కేటాయించిన శాఖలపై పట్టు లేక పోవడం ఇబ్బందిగా మారిందన్నారు. డిప్యూటీ సీఎంకు హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి సబ్జెక్టు అయినా సరే తాను చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. కానీ చర్చించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తన శాఖలకు సంబంధించి పట్టు పెంచుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
Harish Rao Shocking Comments on Deputy CM Bhatti Vikramarka
డిప్యూటీ సీఎంగా, విద్యుత్ శాఖ మంత్రిగా రెండేళ్లు పూర్తయినప్పటికీ తన శాఖలోని విషయాలపై ఆయనకు పట్టు లేకుండా పోయిందన్నారు . విద్యుత్ పై అసెంబ్లీ సాక్షిగా భట్టి విక్రమార్క విడుదల చేసిన స్టేట్ పవర్ సెక్టార్ శ్వేతపత్రం, ఇటీవల విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025, నిన్న పీపీటీలో ప్రదర్శించిన వాటికి ఒకదానికి ఒకటి పొంతన లేదన్నారు. విద్యుత్ అధికారులు ఒక్కోసారి ఒక్కో లెక్కలతో భట్టి చేతుల మీదుగానే ఆవిష్కపరింప చేస్తున్నారంటేఆయనకు కనీస అవగాహన కూడా లేదన్నది స్పష్టం అవుతోందన్నారు. రెండు సంవత్సరాలుగా విడుదల చేసినవి ఏమిటో, ఇప్పుడు చెబుతున్నవి ఏమిటో ఒకసారి చూడాలని, కళ్లుండి కూడా చూడలేక పోవడం దారుణని పేర్కొన్నారు భట్టి విక్రమార్కను ఉద్దేశించి.
Also Read : Mettu Sai Kumar Fired on Talasani : తెలంగాణ గురించి మాట్లాడే హక్కు తలసానికి లేదు
















