Harish Rao : హైదరాబాద్ : బతుకు దెరువు కోసం తెలంగాణ నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్‌లో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao). ఈ సందర్బంగా ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఎలాగైనా సరే మిమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఆందోళన పడకండి అని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మీ సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు హరీశ్ రావు. మిమ్మల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు బాధిత కూలీలకు.
MLA Harish Rao Assure
మీ ఇబ్బందులు తమ దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు మాజీ మంత్రి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఎలాగైనా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని, అధైర్య పడవద్దని చెప్పారు హరీష్ రావు. ఇదిలా ఉండగా ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్నారు 12 మంది నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వక పోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హరీష్ రావుకు గోడు వెళ్ల బోసుకున్నారు.
Also Read : Telangana Farmers Strong Demand : బోనస్ కోసం అన్నదాతల ఎదురుచూపు

















